రూ.11,999 ధరకే రెడ్‌మీ ఎంఐ ఏ2, నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్స్

షావోమీ కంపెనీ  తన రెడ్‌మీ నోట్ 6 ప్రో, ఎంఐ ఏ2 స్మార్ట్ ఫోన్స్ పై తగ్గింపు ని ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ రూ.11,999 లకి లభిస్తున్నాయి. 

ఎంఐ ఏ2 స్మార్ట్ ఫోన్ 5.99 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరాలను ఇచ్చారు. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3300 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. 

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ 6.24 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 12+5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 20+2 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరాలను ఇచ్చారు. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4000 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: