మార్కెట్ లోకి Vu ఆండ్రాయిడ్ 4K UHD స్మార్ట్ టివిలు

Vu టెలివిజన్ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా తన ఆండ్రాయిడ్ టివిలను విడుదల చేసింది. ఈ 4K UHD టివిలు 43, 45, 55 అంగుళాల మోడల్స్ లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టివిల యొక్క ధర వరుసగా రూ.36,999, రూ.46,999 మరియు రూ.55,999. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో మార్చి 16 నుండి  కొనుగోలు చేయవచ్చు.

Vu 4K UHD tv - మార్కెట్ లోకి Vu ఆండ్రాయిడ్ 4K UHD స్మార్ట్ టివిలు

ఈ స్మార్ట్ టివిలు ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్, మాలి T860 జిపియు, 2.5జిబి రామ్, 16జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉన్నాయి. అలాగే 10 + 10 వాట్ బాక్స్ స్పీకర్స్ కలిగిన ఈ స్మార్ట్ టివిలు డాల్బీ డిజిటల్, డిటిఎస్ సపోర్ట్ చేస్తాయి. వైఫై, బ్లూ టూత్, HDMI, యు.ఎస్.బి 2, ఈథర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తాయి. అలాగే వాయిస్ సెర్చ్ కోసం Vu ActiVoice టెక్నాలజీ కుడా కలిగి ఉన్నాయి.

flipkarta - మార్కెట్ లోకి Vu ఆండ్రాయిడ్ 4K UHD స్మార్ట్ టివిలు

తెలుగులో లేటెస్ట్ టెక్ విశేషాలు కోసం, చూస్తూనే ఉండండి….తెలుగు డిజిట్.కామ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address