ముఖ్యమైన VLC మీడియా ప్లేయర్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి

మనం వీడియోస్ ప్లే చేయడానికి రకరకాల వీడియో ప్లేయర్స్ ఉపయోగిస్తుంటాం. వీటిలో VLC మీడియా ప్లేయర్ ఒకటి. వీడియోస్ ని ప్లే చేస్తున్నపుడు ఎక్కువగా మౌస్ ని ఉపయోగించి మనం కావాల్సిన ఆప్షన్ ని క్లిక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా సింపుల్ గా కీ బోర్డు షార్ట్ కట్స్ ద్వారా ఒక సింగిల్ కీ తో వీడియోస్ యొక్క ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్ట్ లో VLC మీడియా ప్లేయర్ కీ బోర్డు షార్ట్ కట్స్ ఏమిటో చూద్దాం.

VLC MEDIA PLAYER SHORT CUTs - ముఖ్యమైన VLC మీడియా ప్లేయర్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి

Space Bar : వీడియోస్ ని  ప్లే/పాజ్ చెయ్యవచ్చు

F : ఈ  కీ ని ఉపయోగించి వీడియోస్ ని ఫుల్ స్క్రీన్ మోడ్ లో చూడవచ్చు. 

M : ఈ  కీ తో ఆడియోని మ్యూట్ మరియు అన్ మ్యూట్ చెయ్యవచ్చు.

P : ఈ  కీ తో వీడియోస్ ని మొదట నుండి స్టార్ట్ చేయవచ్చు

S : ఈ  కీ తో మొత్తం  వీడియోని స్టాప్ చెయ్యవచ్చు

V : ఈ  కీ తో సబ్ టైటిల్స్ ని ఆఫ్ మరియు ఆన్ చెయ్యవచ్చు

Ctrl +H : ఇంటర్ ఫేస్ ని హైడ్ చేసి, వీడియోని మాత్రమే చూపిస్తుంది.

Ctrl +W : VLC మీడియా ప్లేయర్ క్లోజ్ చెయ్యవచ్చు

Ctrl +Up : ఒకసారి ప్రెస్ చేస్తే ఆడియోని 5% పెంచవచ్చు

Ctrl +Down : ఒకసారి ప్రెస్ చేస్తే ఆడియోని 5% తగ్గించవచ్చు

Ctrl +Right : వీడియోస్ ని ఒక నిమిషం ఫార్వర్డ్ చెయ్యవచ్చు

Ctrl +Left : వీడియోస్ ని ఒక నిమిషం బ్యాక్ వర్డ్ చెయ్యవచ్చు

Alt +Right : వీడియోస్ ని 10 సెకండ్స్ ఫార్వర్డ్ చెయ్యవచ్చు

Alt +Left : వీడియోస్ ని 10 సెకండ్స్ బ్యాక్ వర్డ్ చెయ్యవచ్చు

Shift +Right : వీడియోస్ ని 3 సెకండ్స్ ఫార్వర్డ్ చెయ్యవచ్చు

Shift +Left : వీడియోస్ ని 3 సెకండ్స్ బ్యాక్ వర్డ్ చెయ్యవచ్చు

 

ఈ కీ బోర్డు షార్ట్ కట్స్ తో వీడియోస్ VLC మీడియా ప్లేయర్ లో ఈజీ గా నావిగేట్ చేసి చూడవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: