ఇండియన్ మార్కెట్ లోకి #Samsung Galaxy Note 9 స్మార్ట్ ఫోన్: ధర,స్పెసిఫికేషన్స్,ఫీచర్స్ వివరాలు

సామ్ సంగ్ ఇండియన్ మార్కెట్ లోకి Samsung Galaxy Note 9 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు మోడల్స్ లో లభిస్తుంది. 6 జిబి ర్యామ్/128బి ఇంటర్నల్ మెమరీ మోడల్  యొక్క ధర రూ. 67,900 మరియు 8జిబి ర్యామ్/512బి ఇంటర్నల్ మెమరీ మోడల్ యొక్క ధర రూ. 84,900.

Samsung Galaxy Note 9 - ఇండియన్ మార్కెట్ లోకి #Samsung Galaxy Note 9 స్మార్ట్ ఫోన్: ధర,స్పెసిఫికేషన్స్,ఫీచర్స్ వివరాలు

Samsung Galaxy Note 9 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ :

Samsung Galaxy Note 9 స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల క్వాడ్ HD సూపర్ AMOLED డిస్ ప్లే, ఆక్టా కోర్ Exynos 9810 ప్రాసెసర్, 6/8 జిబి ర్యామ్, 128/512జిబి ఇంటర్నల్ మెమరీ, 12+12 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.0(Oreo) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ గల 4000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది.  

Samsung Galaxy Note 9 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.4 అంగుళాల క్వాడ్ HD సూపర్ AMOLED డిస్ ప్లే
» 2960 X 1440 రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0(Oreo) ఆపరేటింగ్
» ఆక్టా కోర్ Exynos 9810 ప్రాసెసర్
» 6/8 జిబి ర్యామ్
» 128/512జిబి ఇంటర్నల్ మెమరీ

» 12 +12 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు 
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 LE

Samsung Galaxy Note 9 బ్లాక్, బ్లూ, కాపర్ కలర్స్ లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, సామ్ సంగ్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: