యూ ట్యూబ్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి


మనం యూ ట్యూబ్ వీడియోస్ చూస్తున్నపుడు ప్లే, ఫార్వర్డ్, రివైండ్ చేస్తూ ఉంటాం. దీనికి ప్రతీ సారి మౌస్ కర్సర్ ని ఉపయోగించి మనం కావాల్సిన ఆప్షన్ బటన్ ని క్లిక్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కీ బోర్డు లో ఒక సింగిల్ కీ తో కూడా వీడియోస్ ని  ప్లే, ఫార్వర్డ్, రివైండ్ లేదా మనం కావాల్సిన ఆప్షన్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ కీ బోర్డు షార్ట్ కట్స్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్ వంటి అన్ని బ్రౌజరులో పనిచేస్తాయి. ఈ పోస్ట్ లో యూ ట్యూబ్ కీ బోర్డు షార్ట్ కట్స్ ఏమిటో చూద్దాం.

YouTube logo full color - యూ ట్యూబ్ కీ బోర్డు షార్ట్ కట్స్ తెలుసుకోండి

J Key : 
కీ బోర్డు లో గల J కీ ని ఉపయోగించి మీరు యూ ట్యూబ్ వీడియోస్ ని 10 సెకండ్స్ బ్యాక్ వర్డ్ చేయవచ్చు

L Key : 
కీ బోర్డు J కీ తో యూ ట్యూబ్ వీడియోస్ ని 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేయవచ్చు

K Key : 
ఈ కీ తో యూ ట్యూబ్ వీడియోస్ ని ప్లే మరియు పాజ్ చేయవచ్చు

0 Key : 
జీరో కీ తో యూ ట్యూబ్ వీడియోస్ ని ప్లే చేస్తున్నపుడు గానీ, పాజ్ చేసినప్పుడు గానీ మరలా వీడియోస్ ని మొదట నుండి స్టార్ట్ చేయవచ్చు

1-9 Keys : 
1-9 కీ లతో యూ ట్యూబ్ వీడియోస్ ని మనకి కావాల్సిన పర్సంటేజ్ వరకు స్కిప్ చేయవచ్చు. అంటే 1 కీ తో 10 శాతం వరకు, 2 కీ తో 20 శాతం వరకు, 3 కీ తో 30 శాతం వరకు……9 కీ తో 90 శాతం వరకు అన్నమాట. 

ఈ కీ బోర్డు షార్ట్ కట్స్ తో ఈజీ గా యూ ట్యూబ్ వీడియోస్ మనకి కావాల్సిన విధంగా చూడవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: