#Poco F1: లిక్విడ్ కూల్ టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ఫీచర్స్ తో #Xiaomi స్మార్ట్ ఫోన్

Xiaomi కంపెనీ సబ్ బ్రాండ్ అయిన Poco ఇండియన్ మార్కెట్ లోకి  Poco F1 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. లిక్విడ్ కూల్ టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ వంటి స్పెషల్ ఫీచర్ గల ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.20,999.

Poco F1 - #Poco F1: లిక్విడ్ కూల్ టెక్నాలజీ, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ఫీచర్స్ తో #Xiaomi స్మార్ట్ ఫోన్

Poco F1 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:

Poco F1 స్మార్ట్ ఫోన్ 6.18 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ  డిస్ ప్లే, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8జిబి ర్యామ్, 64/128/256 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 12+5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 20 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరాలను ఇచ్చారు.  

డ్యూయల్ 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4000 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. అలాగే ఫింగర్ ప్రింట్ స్కానర్, IR పేస్ అన్ లాక్ ఫీచర్స్ కలిగి ఉంది. 

విడుదల సందర్భంగా ఆఫర్స్:

HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.1000 తగ్గింపు ఆఫర్, రిలయన్స్ జియోపై రూ.8000 వరకు తక్షణ ఆఫర్స్ మరియు 6టిబి అదనపు డేటా 

Poco F1 క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 6.18 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ  డిస్ ప్లే
» 2246 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
» 6/8జిబి ర్యామ్
» 64/128/256 జిబి ఇంటర్నల్ మెమరీ

» 12+5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 20 మెగా పిక్సెల్ ఫ్రంట్  కెమెరా
» 4000 mAH బ్యాటరీ
» 4డ్యూయల్ 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 5

Poco F1 స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, రెడ్ కలర్స్ లో లభిస్తుంది. ఆగష్టు 29 నుండి mi.com వెబ్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి