ఈ రోజు మద్యాహ్నం 12 గం.లకు One Plus 6 రెడ్ కలర్ స్మార్ట్ ఫోన్ సేల్

గత నెల One Plus 6 రెడ్ కలర్ వేరియంట్  స్మార్ట్ ఫోన్ విడుదలయిన అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మద్యాహ్నం 12 గం.ల నుండి అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. రెడ్ కలర్ One Plus 6  స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 39,999. 

one plus 6 red - ఈ రోజు మద్యాహ్నం 12 గం.లకు One Plus 6 రెడ్ కలర్ స్మార్ట్ ఫోన్ సేల్

 

One Plus 6 స్మార్ట్ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ HD ఆప్టిక్ AMOLED డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ మరియు 20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా లు గల డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. అలాగే సేల్ఫీస్ కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు.ఎస్.బి టైప్ సి, జిపిఎస్, ఎన్ ఎఫ్ సి, బ్లూ టూత్ 5.0 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3300 mAh బ్యాటరీని ఉపయోగించారు. amazona - ఈ రోజు మద్యాహ్నం 12 గం.లకు One Plus 6 రెడ్ కలర్ స్మార్ట్ ఫోన్ సేల్

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి