ఇండియన్ మార్కెట్ లోకి Infinix Hot 4 Pro, Note 4 స్మార్ట్ ఫోన్స్

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Infinix కొత్తగా ఇండియన్ మార్కెట్ లోకి Hot 4 Pro, Note 4 అనే రెండు  స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క ధర వరుసగా రూ.7,499 మరియు  రూ.8,999. ఆగష్టు 3 నుండి ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

 Infinix Hot 4 Pro - ఇండియన్ మార్కెట్ లోకి Infinix Hot 4 Pro, Note 4 స్మార్ట్ ఫోన్స్                                     

Infinix Hot 4 Pro స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల HD డిస్ ప్లే, 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 128 జిబి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్, ఎల్.ఇ.డి ఫ్లాష్ గల 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, యు.ఎస్.బి OTG, జిపిఎస్, బ్లూ టూత్ 4.1 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

Infinix Note 4 - ఇండియన్ మార్కెట్ లోకి Infinix Hot 4 Pro, Note 4 స్మార్ట్ ఫోన్స్

Infinix Note 4 స్మార్ట్ ఫోన్ 5.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే, 1.3 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ MT6753 ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 128 జిబి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్, ఎల్.ఇ.డి ఫ్లాష్ గల 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, యు.ఎస్.బి OTG, జిపిఎస్, బ్లూ టూత్ 4.1 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4300 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: