#Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?
పేస్ బుక్ యొక్క ఇన్స్టెంట్ మెసేజింగ్ ఆప్ అయిన వాట్సాప్ కొత్తగా స్టిక్కర్స్ ఫీచర్ ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవాలంటే ముందుగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవాలసి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ లో స్టిక్కర్స్ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో వివరంగా చూద్దాం.
ముందుగా కావలసినవి:
వాట్సాప్ వెర్షన్ 2.18( ఆ పై వెర్షన్)
ఇంటర్నెట్ కనెక్షన్
స్టెప్స్:
ముందుగా మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చెయ్యండి
మీరు ఎవరికయితే స్టికర్ పంపాలనుకుంటున్నారో, ఆ కాంటాక్ట్ చాట్ ని ఓపెన్ చెయ్యండి
ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఎడమవైపున ఉన్న స్మైలీ ఐకాన్ క్లిక్ చెయ్యండి
తరువాత GIF ఐకాన్ ప్రక్కన ఉన్న స్టికర్ ఐకాన్ క్లిక్ చెయ్యండి
- మీ జి-మెయిల్ పాస్ వర్డ్ ని మరిచిపోయారా? ఇలా రికవర్ చేసుకోండి
- మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?
- మీ వైఫై నెట్ వర్క్ యొక్క మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవడం ఎలా?
- ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా?- తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు
- #ట్రాయ్ ఆప్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చెయ్యటం ఎలా?
ఇప్పుడు మీరు పంపాలనుకుంటున్న స్టికర్ ని టాప్ చెయ్యగానే పంపించబడుతుంది.
ఇప్పుడు వాట్సాప్ స్టికర్ స్ ని ఎలా డౌన్ లోడ్ చెయ్యాలో చూద్దాం:
ముందుగా వాట్సాప్ కాంటాక్ట్ చాట్ లో స్టికర్ ఐకాన్ ని ఓపెన్ చెయ్యండి
తరువాత స్టికర్ మెనూ లో పైన కుడి వైపున గల + ని క్లిక్ చెయ్యండి
ఇప్పుడు స్టికర్ ప్యాక్ ని సెలెక్ట్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోండి
అలాగే క్రింద నున్న GET MORE STICKERS ని క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి కుడా స్టికర్ ప్యాక్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వీడియో: