మీ ఫోన్ లో రెండు #Whatsapp అకౌంట్స్ ని ఉపయోగించటం ఎలా?

ఇప్పుడు ప్రతి స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్స్ తో రెండు నెంబర్స్ ఉపయోగించేలా మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే రెండు వాట్సాప్ అకౌంట్స్ ఉపయోగించే వీలు ఉండేది కాదు, కానీ Xiaomi, Samsung, Vivo, Oppo, Huawei, Honor వంటి ప్రముఖ కంపెనీలు డ్యూయల్ ఆప్ ఫీచర్ తో ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ఉపయోగించే వీలుని కల్పిస్తున్నాయి. అయితే ఈ పోస్ట్ లో రెండు వాట్సాప్ అకౌంట్స్ ఉపయోగించాలో వివరంగా చూద్దాం. అయితే వివిధ కంపెనీలు యొక్క ఈ  ఫీచర్ ని ముందుగా చూద్దాం.

341519 PA98CU 905 - మీ ఫోన్ లో రెండు #Whatsapp అకౌంట్స్ ని ఉపయోగించటం ఎలా?Logo image created by Freepik

 Xiaomi ఫోన్ లో Dual apps పేరుతో ఉన్న ఈ  ఫీచర్ ని  Settings కి వెళ్లి Dual Apps ని ఉపయోగించవచ్చు.

 Oppo ఫోన్ లో Clone Apps పేరుతో ఉన్న ఈ  ఫీచర్ ని  Settings కి వెళ్లి Clone Apps ని ఉపయోగించవచ్చు.

 Samsung ఫోన్ లో Dual Messanger పేరుతో ఉన్న ఈ  ఫీచర్ ని  Settings కి వెళ్లి Advance features లో Dual Messanger ని ఉపయోగించవచ్చు.

 Asus ఫోన్ లో  Twin apps పేరుతో ఉన్న ఈ  ఫీచర్ ని  Settings కి వెళ్లి Twin apps ని ఉపయోగించవచ్చు.

 Huawei ఫోన్ లో  App Twin పేరుతో ఉన్న ఈ  ఫీచర్ ని  Settings కి వెళ్లి App Twin ని ఉపయోగించవచ్చు.

ఇప్పుడు డ్యూయల్  వాట్సాప్ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో   చూద్దాం:

 ముందుగా Settings లో డ్యూయల్  ఆప్స్ ఫీచర్ ని ఓపెన్ చెయ్యండి 

 తరువాత ఏ ఆప్ డూప్లికేట్ కావాలనుకుంటున్నారో ఆ ఆప్ ని సెలెక్ట్   చెయ్యండి(ఉదాహరణకు Whatsapp)

 ఇప్పుడు ఆప్ క్రియేట్ అయిన తరువాత హోం స్క్రీన్ లో రెండవ Whatsapp లోగో గమనించగలరు.

 తరువాత రెండవ ఫోన్ నెంబర్ తో  Whatsapp ని ఉపయోగించవచ్చు

 అయితే  కొన్ని ఫోన్స్ లో మాత్రం డ్యూయల్  ఆప్స్ ఫీచర్ ని కలిగి ఉండటం లేదు. దీనికి గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తున్న Dual App Wizard, DoubbleApp, Parallel వంటి ఆప్స్ ని డౌన్ లోడ్ చేసుకొని రెండు వాట్సాప్ అకౌంట్స్ ఉపయోగించవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address