ఆండ్రాయిడ్ ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

మనం లాప్ టాప్ గాని, టాబ్లెట్ గాని ఇంటర్ నెట్ కనెక్ట్ చెయ్యాలంటే …వై ఫై రూటర్స్ ని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఏ రూటర్స్ అవసరం లేకుండా మీ ఆండ్రాయిడ్ మొబైల్ నే “వై ఫై హాట్ స్పాట్” ఫీచర్ తో వై ఫై రూటర్ గా ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా  మీ లాప్ టాప్, టాబ్లెట్ మరియు ఇతర స్మార్ట్  ఫోన్స్ కి ఇంటర్ నెట్  కనెక్ట్ అవ్వవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్  లో వై ఫై హాట్ స్పాట్ ని క్రియేట్ చెయ్యడం ఎలా అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం.

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో Settings ని ఓపెన్ చెయ్యండి. తరువాత More...ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.

Android Phone WIFI router 576x1024 - ఆండ్రాయిడ్  ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

ఇప్పుడు అక్కడ వచ్చిన Wireless & networks లో   Tethering & Portable Hotspot అన్న ఆప్షన్ క్లిక్ చెయ్యండి.

Android Phone WIFI router1 - ఆండ్రాయిడ్  ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

ఇక్కడ Portable WLAN hotspot అన్న ఫీచర్ ని ఆన్ చెయ్యండి. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ మొబైల్ వై ఫై రూటర్స్ గా పనిచేస్తుంది. దీని ద్వారా లాప్ టాప్, టాబ్లెట్ మరియు ఇతర ఫోన్స్ కి వై ఫై ద్వారా  ఇంటర్ నెట్  కనెక్ట్ అవ్వవచ్చు.

Android Phone WIFI router2 - ఆండ్రాయిడ్  ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

అలాగే Set up WLAN hotspot ని  ఓపెన్ చేసి  Network Name, Security  మరియు  Password  సెట్ చేసుకోవచ్చు.

Android Phone WIFI router3 - ఆండ్రాయిడ్  ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి… తెలుగు డిజిట్.కామ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

One thought on “ఆండ్రాయిడ్ ఫోన్ ని వై ఫై రూటర్ గా ఉపయోగించటం ఎలా?

కామెంట్స్: