ట్రాయ్ కొత్త నిబంధనలతో ఎయిర్ టెల్ డిజిటల్ టివిలో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవటం ఎలా?

TRAI కొత్త నిబంధనలతో టీవీ కొత్త చానెల్స్ ను ఎంచుకొనే అవకాశాన్ని మార్చి 31 వ తేదీ వరకు పొడిగించింది. కొత్త నిబంధనల నేపథ్యంలో ఒక్కో ఛానెల్ ఒక్కో ధర కలిగిఉన్నాయి. అలాగే  బేసిక్ ప్యాక్‌ కింద వినియోగదారులకు 100 ఛానెళ్లు చూసుకునే అవకాశం, దీనికి రూ. 130 మరియు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు అదనంగా ఛానెళ్లు  కావాలంటే మీరు తీసుకునే ప్యాక్ ధర మరియు జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాక ఒక్కో  ఛానెల్ గ్రూప్, వాటి  టీవీ ఛానల్స్ కలిపి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తునాయి. అయితే ఇప్పుడు ఎయిర్ టెల్ డిజిటల్ టివి లో చానెల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వివరంగా చూద్దాం….                    

ఎయిర్ టెల్ వెబ్ సైట్ ద్వారా:                   

స్టెప్స్:

ముందుగా ఎయిర్ టెల్ వెబ్ సైట్ లో లాగిన్ పేజి ఓపెన్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి. 

 తరువాతమీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP కోడ్ వస్తుంది. అక్కడ OTP నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

 ఇప్పుడు పేజిలో ఎడమవైపు  నున్న DTH ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి. ఇక్కడ Choose Now ఆప్షన్ వస్తుంది.

ఇక్కడ రెండు ఎయిర్ టెల్ రికమెండ్ పాక్స్ రూ.452 మరియు రూ.183 పాక్స్ ని ఎంచుకోవచ్చు లేదా క్రింద నున్న Create your own pack సెలెక్ట్ చేసుకొని వివిధ చానల్స్ ని ఎంచుకోవచ్చు.

తరువాత Review & Buy ఆప్షన్ ని క్లిక్ చేస్తే ప్రస్తుత మరియు కొత్తగా సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ కి తేడాని గమనించవచ్చు.

 ఇప్పుడు Confirm బటన్ క్లిక్ చేసి ప్లాన్ ని సేవ్ చెయ్యండి .  

ఎయిర్ టెల్ మొబైల్ ఆప్ ద్వారా:

స్టెప్స్:

ముందుగా మై ఎయిర్ టెల్ మొబైల్ ఆప్ ని మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చెయ్యండి  

 ఇప్పుడు ఆప్ ని ఓపెన్ చేసి My Account సెక్షన్ కి వెళ్ళండి. ఒకవేళ మీ DTH కనెక్షన్ ఆప్ లో రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చెయ్యండి

ఇక్కడ DTH Connection లో My Account ఆప్షన్ లో పైన గల Connection క్లిక్ చెయ్యండి.  ఇప్పుడు  Choose Plan క్లిక్ చేసి Create Your Own Pack సెలెక్ట్ చేసుకొని వివిధ చానల్స్ ని ఎంచుకోవచ్చు.

తరువాత Review & Buy ఆప్షన్ ని క్లిక్ చేసి Confirm బటన్ క్లిక్ చేసి ప్లాన్ ని సేవ్ చెయ్యండి .  

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address