Wi Fi Network – వైర్ లెస్ హోమ్ నెట్ వర్క్ ని సెక్యూర్ చెయ్యడం ఎలా?

మనం కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్ లో ఏ విదమైన కేబుల్స్ అవసరం లేకుండా, వైర్ లెస్ నెట్ వర్క్(వై ఫై) ద్వారా ఇంటర్ నెట్ ని ఈజీ గా కనెక్ట్ అయ్యి ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మీరు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ వాడుతున్నప్పుడు వైర్ లెస్ నెట్ వర్క్ గాని సెక్యూర్ కాకపోతే, బయట వారు కూడా మీ వై ఫై నెట్ వర్క్ ని వాడుతూ ఉండవచ్చు. దీని వలన నెల వారీ ఇంటర్ నెట్ బిల్ పెరగడం, ఇంటర్ నెట్ స్పీడ్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. అంతే కాకుండా ఒక్కొక్కసారి కంప్యూటర్ ని హ్యాక్ చేసి పర్సనల్ ఫైల్స్ ని కూడా పొందే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా వైర్ లెస్ నెట్ వర్క్ ని రూటర్స్ లో ఎలా సెక్యూర్ చెయ్యాలి అన్నది ఇప్పుడు చూద్దాం .

1. ముందుగా ఇంటర్ నెట్ బ్రౌజరు లో 192.168.1.1 అని టైప్ చేసి, ఎంటర్ చెయ్యండి.

router1౩ - Wi Fi Network - వైర్ లెస్ హోమ్ నెట్ వర్క్ ని  సెక్యూర్ చెయ్యడం ఎలా?

ఇక్కడ వచ్చిన విండో లోరూటర్ యొక్క User Name, Password ని ఎంటర్ చెయ్యండి.

Default Username: admin

Default Password: password

(ఒక్కొక్క రూటర్ కి మారుతూ ఉండవచ్చు. మీ రూటర్ యొక్క యూసర్ మాన్యువల్ ని చూడండి).

2. ఇప్పుడు రూటర్  బేసిక్ సెట్టింగ్స్ లో Wireless Settings ని ఓపెన్ చెయ్యండి. అక్కడ SSID లో డీఫాల్ట్ గా మీరు వాడుతున్న రూటర్ బ్రాండ్ యొక్క పేరు ఉంటుంది. ఇక్కడ SSID  యొక్క పేరు ని మార్చండి.

wifi11 - Wi Fi Network - వైర్ లెస్ హోమ్ నెట్ వర్క్ ని  సెక్యూర్ చెయ్యడం ఎలా?

3. తరువాత Security Options(Encryption Methods) లో WEP, WPA, WPA2 అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ WEP అన్నది బేసిక్ సెక్యూరిటీ  ఆప్షన్ మరియు WPA2 అన్నది ఎక్కువ సెక్యూరిటీ గల ఆప్షన్. మీరు పాత రూటర్స్ ని వాడుతుంటే WEP ని సెలెక్ట్ చెయ్యండి లేకపోతే WPA2 ని సెలెక్ట్ చెయ్యండి. ఇప్పుడు passphrase లో వై ఫై నెట్ వర్క్ కి సెట్ చెయ్యాలనుకుంటున్న పాస్ వర్డ్ ని టైప్ చేసి Apply ని క్లిక్ చెయ్యండి.

wifi12 - Wi Fi Network - వైర్ లెస్ హోమ్ నెట్ వర్క్ ని  సెక్యూర్ చెయ్యడం ఎలా?

దీని ద్వారా మీ  వైర్ లెస్ నెట్ వర్క్  మరింత సెక్యూర్ గా ఉంటుంది.

(Note : ఈ పోస్ట్ లో చూపించిన ఇమెజేస్ Netgear రూటర్ వి)

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి