మీ జి-మెయిల్ పాస్ వర్డ్ ని మరిచిపోయారా? ఇలా రికవర్ చేసుకోండి

మనం జి మెయిల్(లేదా గూగుల్) ని తరుచుగా ఉపయోగిస్తున్నప్పుడు కొన్నికొన్ని సందర్భాలలో పాస్ వర్డ్ మరిచిపోతూ ఉంటాం. అలాగే ఒకే పాస్ వర్డ్ ఉపయోగిస్తూ ఉండటం వల్ల హ్యాకర్స్ పాస్ వర్డ్ ని తెలుసుకొని మార్చే ప్రమాదం కుడా ఉంది. కొంతమంది ఆప్స్ ఉపయోగించి అన్ని పాస్ వర్డ్స్ ఒకేచోట స్టోర్ చేసుకుంటూ ఉంటారు.

అయితే ఈ పోస్ట్ లో మర్చిపోయిన జి మెయిల్ పాస్ వర్డ్ ఎలా రికవర్  చేసుకోవాలో వివరంగా చూద్దాం.

 ముందుగా గూగుల్ లాగిన్ పేజిలో Forget Password ని క్లిక్ చెయ్యండి. 

 తరువాత ఒకవేళ  లాస్ట్  పాస్ వర్డ్  గుర్తు ఉంటె అక్కడ  ఎంటర్  చెయ్యండి. లేకపోతే Take another way ఆప్షన్ క్లిక్ చెయ్యండి 

 ఇప్పుడు గూగుల్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి వెరిఫికేషన్ కోడ్ పంపించే నోటిఫికేషన్ పేజి వస్తుంది.  అక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేస్తే  వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

 ఒకవేళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోతే Take another way ఆప్షన్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు గూగుల్ మీరు జి మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తేది, సంవత్సరం అడుగుతుంది.

 లేకపోతే మరొక Take another way ఆప్షన్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు గూగుల్ వెరిఫికేషన్ కోడ్ పంపించటానికి ప్రత్యామ్నాయ ఈ మెయిల్ ఐడిని అడుగుతుంది.   అక్కడ మీ ఈ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తే  వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

 లేకపోతే మరొక Take another way ఆప్షన్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు గూగుల్ మీ అకౌంట్ ని రివ్యూ చేయడానికి వేరొక  ఈ మెయిల్ ఐడిని అడుగుతుంది.   

 ఇప్పుడు  మీ మొబైల్ నెంబర్/ ఈ మెయిల్ ఐడికి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే, కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకొని జి మెయిల్ ని ఉపయోగించుకోవచ్చు.  

ఈ క్రింద నున్న వీడియోలో జి మెయిల్ పాస్ వర్డ్ ని ఎలా రికవర్ చేసుకోవాలో మరింత  వివరంగా చూడండి.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: