మీ మొబైల్ నెంబర్ కి OTP ద్వారా ఆధార్ ని లింక్ చెయ్యడం ఎలా?

ఇండియన్ గవర్నమెంట్ మొబైల్ నెంబర్ కి ఆధార్ తప్పని సరిగా జత చేయాలని మార్చి 31, 2018 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొబైల్ నెట్వర్క్ సెంటర్ ని సంప్రదించి ఆధార్ ని జత చేసుకోవలసి వచ్చేది, కాని ఇప్పుడు ఇంటి వద్ద నుండే మొబైల్ OTP వెరిఫికేషన్ పద్ధతి ద్వారా  ఆధార్ ని జత చేసుకోవచ్చు. దీనికి IVR నెంబర్ కి కాల్ చేసి OTP పాస్ వర్డ్ వెరిఫికేషన్ తో ఆధార్ ని లింక్  చేయవచ్చు. IVR ప్రాసెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు మిగతా రీజినల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు  OTP ప్రాసెస్ ద్వారా మొబైల్ నెంబర్ కి ఆధార్  ని ఎలా లింక్ చేయాలో చూద్దాం

ముందుగా IVR టోల్ ఫ్రీ నెంబర్ 14546 కి కాల్ చెయ్యండి 

⇒ తరువాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి, మొబైల్ నెంబర్ కి ఆధార్ ని లింక్ చెయ్యడానికి సమ్మతి
తెలియచెయ్యండి

⇒ ఇప్పుడు 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి, మీ పేరు, పుట్టిన తేది, చిరునామా లింక్
కావడానికి సమ్మతి తెలియచెయ్యండి

⇒ తరువాత మీరు SMS ద్వారా రిసీవ్ చేసుకున్న OTP ని ఎంటర్ చెయ్యండి

⇒ ఇప్పుడు  వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అవటానికి  48 గంటలు సమయం పడుతున్నట్లు
మెసేజ్ రిసీవ్ 
చేసుకుంటారు 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address