BSNL Broadband Usage – బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

మనం BSNL బ్రాడ్ బ్యాండ్ ఉపయోగిస్తున్నప్పుడు డేటా యూసేజ్ తెలుకోవాలని అనుకుంటే, BSNL యొక్క  Self Care వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాక బిల్స్, పేమెంట్స్, ఆన్ లైన్ కంప్లైంట్స్, సర్వీస్ రిక్వెస్ట్, కాల్ డీటెయిల్స్ ఆప్షన్స్ ని కూడా ఉపయోగించు కోవచ్చు. దీనికి మొదటసారిగా  మీరు కస్టమర్ ఐడి తో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు BSNL Self Care పోర్టల్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి మరియు బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా అన్నది వివరంగా చూద్దాం.

» ముందుగా బ్రౌజరు లో http://selfcare.sdc.bsnl.co.in/ని ఓపెన్ చెయ్యండి.

» అక్కడ లాగిన్ విండో లో వచ్చిన User Registration అన్న ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.

Bsnl11 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» ఇక్కడ వచ్చిన విండో లో Customer ID ఫీల్డ్లో మీ టెలిఫోన్ బిల్ లో ఇచ్చినకస్టమర్ ఐడి ని ఎంటర్ చెయ్యండి.

bsnl12 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

bsnl33 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» ఇప్పుడు User ID ఫీల్డ్లో మీరు కొత్తగా ఇవ్వాలనుకుంటున్న ఐడినిఎంటర్ చెయ్యండి మరియు Password, Verify Password  ఫీల్డ్ లో కొత్తగా పాస్ వర్డ్ ని ఇవ్వండి. తరువాత Challenging Question ఫీల్డ్ లో What is Your Nick Name లాంటి మీకిష్టమైన ప్రశ్న ని ఇచ్చి, దానికి సమాదానాన్ని Answer ఫీల్డ్ లో ఎంటర్ చెయ్యండి. అలాగే E Mail ఫీల్డ్ లో మీ మెయిల్ అడ్రస్ ని ఇచ్చి, తరువాత Do You Have Broad Band డ్రాప్ డౌన్ మెనూ లో Y ని సెలెక్ట్ చెయ్యండి. ఇప్పుడు BB User ID ఫీల్డ్ లో మీ బ్రాడ్ బ్యాండ్ యొక్క యూసర్ ఐడి ని ఇవ్వండి. మీ బ్రాడ్ బ్యాండ్ యొక్క యూసర్ ఐడి ని మీ రూటర్ లో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు లేదా BSNL కస్టమర్ కేర్ ని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు Next ని క్లిక్ చేసి, తరువాత వచ్చిన టర్మ్స్ విండో లో I Agree ని క్లిక్ చెయ్యండి.

bsnl13 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» తరువాత మీ  User ID, Password తోవెబ్ పోర్టల్ లో లాగిన్ అవ్వండి.

bsnl14 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» ఇప్పుడు టాప్ మెనూ లో Service క్లిక్ చెయ్యండి.

bsnl15 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» తరువాత మీరు తెలుసుకోవాలనుకుంటున్న Check My Broadband billed Usage Details లేదాCheck My Broadband Unbilled Usage Details ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి.

bsnl16 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

 

» ఇక్కడ వచ్చిన విండో లో Telephone Number, From Date మరియు To Date నిసెలెక్ట్ చేసి Go ని క్లిక్ చెయ్యండి.ఇప్పుడు మీరు బ్రాడ్ బ్యాండ్ డేటా యూసేజ్ యొక్క వివరాలని చూడవచ్చు. అలాగే Services లో బిల్స్, పేమెంట్స్,ఆన్ లైన్ కంప్లైంట్స్, సర్వీస్ రిక్వెస్ట్, కాల్ డీటెయిల్స్ ఆప్షన్స్ ని కూడా ఉపయోగించు కోవచ్చు.

bsnl18 - BSNL Broadband Usage - బ్రాడ్ బ్యాండ్ యూసేజ్ తెలుసుకోవటం ఎలా?

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: