మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?

మీరు క్రొత్త కంప్యూటర్ని కొన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయాలంటే, ఏ ప్రాసెసర్, ఎంత RAM, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వెర్షన్ ఏమిటి మరియు మిగతా  స్పెక్స్ గురుంచి వెదుకుతూ ఉంటాం. ఉదాహరణకు: Windows ప్రోగ్రామ్ యొక్క వెర్షన్(64/32 బిట్). అయితే ఈ పోస్ట్ మీ కంప్యూటర్ యొక్క స్పెక్స్ ఎలా తెలుసుకోవాలో  వివరంగా చూద్దాం.

computer specs - మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?

  ముందుగా విండోస్ 10 కంప్యూటర్ లో డెస్క్ టాప్ గల This PC పై రైట్ క్లిక్ చేసి Properties ని ఓపెన్  చెయ్యండి. 

 ఇప్పుడు అక్కడ వచ్చిన విండోలో కంప్యూటర్ యొక్క స్పెక్స్ చూడవచ్చు

  విండోస్ ఎడిషన్: 
ఇక్కడ కంప్యూటర్ యొక్క OS వెర్షన్ చూడవచ్చు(ఉదా: Windows 7/ Windows 8/Windows 10)

 సిస్టం:
ఇక్కడ ప్రాసెసర్, వేగం సంబంధించిన వివరాలు చూడవచ్చు. ఉదా: AMD లేదా ఇంటెల్. ప్రస్తుతం ల్యాప్ టాప్ మరియు డెస్క్ టాప్ లలో  ఇంటెల్ ప్రాసెసర్ లు ఉపయోగించబడుతున్నాయి. ఇంటెల్ ప్రాసెసర్ల లలో  i-3, i-5, i-7 ముఖ్యమైనవి. కంప్యూటర్ లలో ప్రోగ్రామ్ లను రన్ చేయాలంటే ప్రాసెసర్ల యొక్క సమాచారం ముఖ్యమైనది. కొన్ని ప్రోగ్రామ్ లను రన్ చేయాలంటే  i-5 లేదా i-7 వంటి ప్రాసెసర్ లు అవసరం.

 ర్యామ్:
తరువాత  RAM, అంటే “రాండమ్ యాక్సెస్ మెమరీ,”. కంప్యూటర్ వేగం కోసం RAM చాల ముఖ్యమైనది.  ప్రస్తుతం 4GB లేదా 8GB RAM లతో ఎక్కువగా  కంప్యూటర్ లు అందుబాటులో ఉంటున్నాయి. 

సిస్టమ్ టైప్:

ప్రస్తుతం చాలావరకు 64-బిట్ సిస్టమ్స్ ఉపగియోస్తున్నారు. పాత రోజుల్లో వాడేవి 32-బిట్ బిట్ సిస్టమ్స్. ప్రోగ్రామ్ లను రన్ చేయటానికి సిస్టమ్ టైప్ కూడా ముఖ్యమైనది.

పెన్ మరియు టచ్:
ల్యాప్ టాప్ మరియు డెస్క్ టాప్ ల టచ్ వివరాలని తెలియజేస్తుంది

ఈ వివరాలు కంప్యూటర్ లో ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చాయడానికి,  ప్రాబ్లమ్స్ ట్రబుల్ షూట్ చేయటానికి సహాయ పడతాయి.  

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: