మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?
మీరు క్రొత్త కంప్యూటర్ని కొన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయాలంటే, ఏ ప్రాసెసర్, ఎంత RAM, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వెర్షన్ ఏమిటి మరియు మిగతా స్పెక్స్ గురుంచి వెదుకుతూ ఉంటాం. ఉదాహరణకు: Windows ప్రోగ్రామ్ యొక్క వెర్షన్(64/32 బిట్). అయితే ఈ పోస్ట్ మీ కంప్యూటర్ యొక్క స్పెక్స్ ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం.
ముందుగా విండోస్ 10 కంప్యూటర్ లో డెస్క్ టాప్ గల This PC పై రైట్ క్లిక్ చేసి Properties ని ఓపెన్ చెయ్యండి.
ఇప్పుడు అక్కడ వచ్చిన విండోలో కంప్యూటర్ యొక్క స్పెక్స్ చూడవచ్చు
విండోస్ ఎడిషన్:
ఇక్కడ కంప్యూటర్ యొక్క OS వెర్షన్ చూడవచ్చు(ఉదా: Windows 7/ Windows 8/Windows 10)
సిస్టం:
ఇక్కడ ప్రాసెసర్, వేగం సంబంధించిన వివరాలు చూడవచ్చు. ఉదా: AMD లేదా ఇంటెల్. ప్రస్తుతం ల్యాప్ టాప్ మరియు డెస్క్ టాప్ లలో ఇంటెల్ ప్రాసెసర్ లు ఉపయోగించబడుతున్నాయి. ఇంటెల్ ప్రాసెసర్ల లలో i-3, i-5, i-7 ముఖ్యమైనవి. కంప్యూటర్ లలో ప్రోగ్రామ్ లను రన్ చేయాలంటే ప్రాసెసర్ల యొక్క సమాచారం ముఖ్యమైనది. కొన్ని ప్రోగ్రామ్ లను రన్ చేయాలంటే i-5 లేదా i-7 వంటి ప్రాసెసర్ లు అవసరం.
- మీ జి-మెయిల్ పాస్ వర్డ్ ని మరిచిపోయారా? ఇలా రికవర్ చేసుకోండి
- మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?
- మీ వైఫై నెట్ వర్క్ యొక్క మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవడం ఎలా?
- ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా?- తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు
- #ట్రాయ్ ఆప్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చెయ్యటం ఎలా?
ర్యామ్:
తరువాత RAM, అంటే “రాండమ్ యాక్సెస్ మెమరీ,”. కంప్యూటర్ వేగం కోసం RAM చాల ముఖ్యమైనది. ప్రస్తుతం 4GB లేదా 8GB RAM లతో ఎక్కువగా కంప్యూటర్ లు అందుబాటులో ఉంటున్నాయి.
సిస్టమ్ టైప్:
ప్రస్తుతం చాలావరకు 64-బిట్ సిస్టమ్స్ ఉపగియోస్తున్నారు. పాత రోజుల్లో వాడేవి 32-బిట్ బిట్ సిస్టమ్స్. ప్రోగ్రామ్ లను రన్ చేయటానికి సిస్టమ్ టైప్ కూడా ముఖ్యమైనది.
పెన్ మరియు టచ్:
ల్యాప్ టాప్ మరియు డెస్క్ టాప్ ల టచ్ వివరాలని తెలియజేస్తుంది
ఈ వివరాలు కంప్యూటర్ లో ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చాయడానికి, ప్రాబ్లమ్స్ ట్రబుల్ షూట్ చేయటానికి సహాయ పడతాయి.