మీ వైఫై నెట్ వర్క్ యొక్క మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవడం ఎలా?

మనం ఇళ్ళలో గానీ, ఆఫీస్ లో గాని నెట్ కి వైఫై నెట్ వర్క్ ని ఎక్కువగా ఉపయోగిస్తు ఉంటాం. ఒకసారి మొబైల్, పిసి, టాబ్లెట్ లో వైఫై పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే, నెట్ ని ఉపయోగించే ప్రతీ సారి పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యవలసిన అవసరం లేకుండానే డిఫాల్ట్ గా నెట్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్బాలలో మనం వైఫై నెట్ వర్క్ కి పెట్టిన పాస్ వర్డ్  మర్చిపోతూ ఉంటాం.

అయితే వైఫై నెట్ వర్క్ కనెక్ట్ అయిన విండోస్ 10 కంప్యూటర్ ని ఉపయోగించి, మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవచ్చు. ఈ పోస్ట్ లో విండోస్ 10 కంప్యూటర్ ని ఉపయోగించి వైఫై నెట్ వర్క్ పాస్ వర్డ్ ఎలా తెలుసుకోవాలో వివరంగా చూద్దాం.

  ముందుగా విండోస్ 10 కంప్యూటర్ లో Start menu లో Settings ని ఓపెన్ చెయ్యండి. 

 తరువాత Network and Internet లో  ఓపెన్ చెయ్యండి.

 ఇప్పుడు పేజి క్రింద నున్న Network Sharing Center  ఓపెన్ చెయ్యండి.  అక్కడ వచ్చిన మెనూలో  WiFi లింక్ పై క్లిక్ చెయ్యండి.

 తరువాత General లో గల Wireless Properties టాబ్ ని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యండి.

 ఇప్పుడు పైన ఉన్న Security టాబ్ ని క్లిక్ చెయ్యండి. మీరు ఇక్కడ Network security key వద్ద పాస్ వర్డ్(••••••) ని గమనించవచ్చు. అయితే ఇక్కడ పాస్ వర్డ్ హైడ్ అయి ఉంటుంది. మీరు క్రింద నున్న show character బాక్స్ ని టిక్ చేస్తే పాస్ వర్డ్ ని చూడవచ్చు. 

ఈ క్రింద నున్న వీడియోలో  విండోస్ 10 కంప్యూటర్ ని ఉపయోగించి  మర్చిపోయిన వైఫై నెట్ వర్క్ పాస్ వర్డ్ ఎలా తెలుసుకోవాలో వివరంగా చూడండి.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: