#గూగుల్ డ్రైవ్ ద్వారా PDF  నుండి Wordకి కన్వర్ట్ చెయ్యటం ఎలా?

అక్రోబాట్ సంస్థ యొక్క PDF(పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మట్) ని 90  సం.లలో ప్రవేశపెట్టింది. అయితే PDF ఫైల్స్ ని చూడటం, క్రియేట్ చెయ్యటం మాత్రం చెయ్యగల్గుతున్నాం. ఒకవేళ PDF ఫైల్స్ ని ఎడిట్ చెయ్యాలంటే Adobe Acrobat Pro సాఫ్ట్వేర్ ని కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. లేకపోతే ఆన్ లైన్ లో  PDF  నుండి Word  కి కన్వేర్ట్ చేసి ఎడిట్ చేస్తాం.

అయితే గూగుల్ డ్రైవ్ లో గల ఫీచర్ ద్వారా  PDF  నుండి Word లేదా టెక్స్ట్ ఆటోమేటిక్ గా కన్వేర్ట్ చెయ్యవచ్చు. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లో ఈ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో  వివరంగా చూద్దాం.

స్టెప్స్:

ముందుగా drive.google.com ఓపెన్ చెయ్యండి 

  తరువాత మీ గూగుల్ ఐడి, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి

 ఇప్పుడు పైన కుడివైపున మూలనున్న గేర్ ఐకాన్ క్లిక్ చెయ్యండి

 తరువాత Settings ని  క్లిక్ చేసి, General సెక్షన్ లో గల ‘Convert Upload’ లో  “Convert uploaded files to Google Docs editor format” ని  సెలెక్ట్ చేసి Done క్లిక్   చెయ్యండి

 ఇప్పుడు PDF ఫైల్ ని అప్ లోడ్ చెయ్యండి.

  అప్ లోడ్ అయిన తరువాత open file ఆప్షన్ లో గల ‘Open with Google Docs’  క్లిక్ చేసి ఎడిటబుల్ ఫార్మాట్ గల వర్డ్ ని చూడవచ్చు.

వీడియో:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address