మార్కెట్ లోకి Alcatel Pixi 4 (7) టాబ్లెట్ (ధర రూ. 3,999)

అల్కాటెల్ కొత్తగా మార్కెట్ లోకి Alcatel Pixi 4 (7) టాబ్లెట్ ని విడుదల చేసింది. ఈ టాబ్లెట్ రెండు మోడల్స్ లో లభిస్తుంది. 4జి మోడల్ యొక్క ధర రూ. 6,499/- మరియు వై ఫై మోడల్ యొక్క ధర రూ. 3,999/-. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, గ్రే కలర్స్ లో లభిస్తుంది.

Alcatel Pixi 4 7 - మార్కెట్ లోకి Alcatel Pixi 4 (7) టాబ్లెట్ (ధర రూ. 3,999)

Alcatel Pixi 4 (7) టాబ్లెట్ 4జి మోడల్ 7 అంగుళాల WXGA డిస్ ప్లే, 1.1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MTK8735D ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.  కలిగి ఉంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 16 జిబి ఇంటర్నల్ మెమరీ మరియు మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 4జి, వై ఫై, యు ఎస్ బి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది. 4000 mAH బాటరీ కలిగి ఉంది.

వై ఫై మోడల్ 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 8 జిబి ఇంటర్నల్ మెమరీ మరియు మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు. వై ఫై, యు ఎస్ బి, బ్లూ టూత్  కనెక్టివిటీ ఆప్షన్స్ సపోర్ట్ చేస్తుంది. 2580 mAH బాటరీ కలిగి ఉంది.

రెండు టాబ్లెట్స్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తాయి. 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: