అపరిమిత కాల్స్, రోజుకు 1జిబి డేటాతో ఎయిర్టెల్ కొత్త రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
ఇండియాలో టాప్ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ సరికొత్త రూ.199 ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్ ని విడుదల చేసింది. 28 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ తో అపరిమిత లోకల్, STD కాల్స్, అపరిమిత రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్, అపరిమిత లోకల్, నేషనల్ SMS పొందవచ్చు. అలాగే రోజుకు 1జిబి 3జి లేదా 4జి డేటాను 28 రోజుల పాటు పొందవచ్చు. ఈ ప్లాన్ పాత మరియు కొత్త ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లందరికీ వర్తిస్తాయి. అయితే ఈ టారిఫ్ ప్లాన్ చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కర్నాటక వంటి ఎంపికచేసిన సర్కిల్స్ లో మాత్రమే లభ్యమవుతుంది.
- మీ జి-మెయిల్ పాస్ వర్డ్ ని మరిచిపోయారా? ఇలా రికవర్ చేసుకోండి
- మీ కంప్యూటర్ యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం ఎలా?
- మీ వైఫై నెట్ వర్క్ యొక్క మర్చిపోయిన పాస్ వర్డ్ ని తెలుసుకోవడం ఎలా?
- ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా?- తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు
- #ట్రాయ్ ఆప్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చెయ్యటం ఎలా?
అలాగే ఈ ప్లాన్ తో పాటు 157 ప్యాక్‌ను కూడా విడుదల చేసింది. 27 రోజుల పాటు వాలిడిటీ గల ఈ ప్లాన్ తో 3జిబి 3జి లేదా 4జి డేటాను పొందవచ్చు.క్రిందటి వారం వొడాఫోన్ రూ.199 ప్లాన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.