రూ.200 లోపు రోజుకి 1.5జిబి డేటా ప్లాన్స్: రిలయన్స్ జియో(Vs)ఎయిర్ టెల్(Vs)వొడాఫోన్(Vs) బీఎస్ఎన్ఎల్

దేశీయ టెలికాం రంగంలో వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టెలికాం ఆపరేటర్స్ కొత్త కొత్త టారిఫ్‌ ప్లాన్స్ ని ప్రవేశపెడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం 1జిబి డేటాకి రూ.250 ఖర్చు చేయాల్సి వచ్చేది, కానీ ప్రస్తుతం రూ.200 లోపే రోజుకి 1.5జిబి డేటా పొందగలుగుతున్నాం. అయితే ప్రస్తుతమున్న మార్కెట్ లో రూ.200 లోపే రోజుకి 1.5జిబి డేటా టారిఫ్‌  ప్లాన్స్ ని ఒకసారి ఇక్కడ గమనిద్దాం.

Reliance Jio రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్ లో బాగంగా రోజుకి 1.5జిబి 4జి డేటాతో 28 రోజుల వాలిడిటీ కలదు. అంటే మొత్తం 42జిబి పొందవచ్చు. అంతేకాక అపరిమిత లోకల్‌, రోమింగ్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగాపొందవచ్చు. అలాగే కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ క్రింద Jio మ్యూజిక్, Jio మూవీస్, Jio టివి వంటి ఆప్స్ ని కూడా పొందవచ్చు.

Vodafone రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్ లో బాగంగా రోజుకి 1.4జిబి హై స్పీడ్ 3జి/4జి డేటాతో 28 రోజుల వాలిడిటీ కలదు. అంటే మొత్తం 42జిబి పొందవచ్చు. అంతేకాక అపరిమిత లోకల్‌, ఎస్.టి.డి కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగాపొందవచ్చు. అలాగే కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ క్రింద Vodafone ప్లే సర్వీసెస్ ని కూడా పొందవచ్చు.

Airtel రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్ లో బాగంగా రోజుకి 1.4జిబి హై స్పీడ్ 3జి/4జి డేటాతో 28 రోజుల వాలిడిటీ కలదు. అంటే మొత్తం 42జిబి పొందవచ్చు. అంతేకాక అపరిమిత లోకల్‌, ఎస్.టి.డి కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగాపొందవచ్చు. కానీ Wynk Music, Airtel TV సర్వీసెస్ ని పోస్ట్ పెయిడ్  వినియోగదారులకు మాత్రమె అందిస్తుంది.

BSNL రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్ తో దేశీయ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ గట్టి పోటినిస్తుంది.  రూ.98 ప్రీపెయిడ్ ప్లాన్ లో బాగంగా రోజుకి 1.5జిబి హై స్పీడ్ 3జి డేటాతో 26 రోజుల వాలిడిటీ కలదు. అంటే మొత్తం 39జిబి పొందవచ్చు. అయితే ఏ విధమయిన  వాయిస్ కాల్స్‌ బెనిఫిట్స్ ని ఉచితంగా అందివ్వట్లేదు.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address